బిజినెస్ ఐడియా: మహిళలూ ఇంట్లో వుండే రోజుకి రెండు వేలు దాకా సంపాదించచ్చు..! ఎలా అంటే..?

-

చాలా మంది మహిళలకి అనిపిస్తూ ఉంటుంది… ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని.. మీకు కూడా అలాగే అనిపిస్తుందా..? ఖాళీ సమయంలో కాస్త సమయాన్ని ఏదైనా పని చేసే డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ఐడియా ని అనుసరించండి. చదువు తో పనే లేదు. ఇలా చేయడం వలన మీరు రోజుకి 2000 నుండి 3000 వరకు సంపాదించుకోవచ్చు.

 

అయితే మరి అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలు కాస్త సమయం ఈ విధంగా అనుసరిస్తే సరిపోతుంది. చాలామంది ఈ మధ్యకాలంలో డబ్బులు సంపాదించడానికి వివిధ రకాల ఆప్షన్స్ ని ఎంచుకుంటున్నారు. అయితే ఈ ఐడియా కూడా బెస్ట్ ఐడియా. పెళ్లిళ్లు మొదలైన ఫంక్షన్లు వంటి వాటికి కచ్చితంగా ఆడవాళ్లు మెహందీని పెట్టుకుంటూ ఉంటారు.

మంచి మెహందీ ని తయారుచేసి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మెహందీ కోన్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. దీనిని మీరు క్యాష్ చేసుకోవచ్చు. మెహందీ కి ప్రత్యేకమైన బ్రాండ్ అంటూ ఏమీ లేదు కాబట్టి మీరు సొంతంగా మంచి మెహందీ కోన్స్ ని తయారు చేసేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. గోరింటాకు మొదటగా దీనికి కావాల్సి ఉంటుంది. అలానే చక్కెర, మూలికలు, ప్యాకింగ్ కి కావలసిన సామాన్లు, పల్మనేజర్ మిషన్ వంటివి కావలసి ఉంటుంది.

వేయింగ్ మిషన్ మెహందీ పౌచ్ ఇలాంటివి కూడా కావాలి వీటిని అన్నిటిని మీరు కొనుగోలు చేసేసి వెంటనే దీన్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ కోసం మీరు గోరింట మొక్కలని పెంచుకోవచ్చు. మెహందీ ఎలా తయారు చేయాలి అనేది మీరు యూట్యూబ్ ద్వారా చూసి నేర్చుకోవచ్చు. లోకల్ షాప్స్ కి సప్లై చేయడం ఆన్లైన్ ద్వారా సేల్ చేయడం స్టార్ట్ చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి. ఒక కోన్ ని మీరు పది రూపాయలు దాకా అమ్మొచ్చు మీరు రోజుకి 100 కోన్స్ ని సప్లై చేసినా రెండు వేల వరకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news