కిమ్ జోంగ్ కంటే, కిమ్ యో జోంగ్ మరింత క్రూరంగా ఉంటారని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఆయన మరణించిన తర్వాత ఆయన చెల్లెలు జోంగ్ అధికార బాధ్యతలను చేపట్టే అవకాశం ఉందని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఆమె ఎలా ఉంటుందో అనే ఆందోళన అన్ని దేశాలకు ఉంది. ఇప్పటికే కిమ్ దెబ్బకు ప్రపంచ దేశాలు అన్నీ కూడా భయపడుతున్నాయి.
ఆమె అధికార బాధ్యతలు చేపడితే ఆమె మరింత క్రూరంగా మారితే అమెరికా సహా జపాన్, దక్షిణ కొరియా దేశాలకు ఇబ్బందే. ఆయనకు సోదరులు ఉన్నా, ఆయనకు పిల్లలు ఉన్నా సరే వాళ్లకు పరిపాలన చేసే వయసు లేకపోవడంతో బాధ్యతలను చేపట్టేది సోదరి అని అందరూ అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన సోదరి గురించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
“కిమ్ జోంగ్ చనిపోయిన తర్వాత అతడి సోదరి అధికారం చేపడతారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె అతడి కంటే మరింత క్రూరురాలు అయితే… ఈ ప్రపంచం మొదటి ఆడ విలన్‌ను చూస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. వర్మ పోస్ట్ చేసిన ఫోటోలో ఆమె లుక్ చూసిన వాళ్ళు కచ్చితంగా కిమ్ కంటే ఆమె క్రూరంగా ఉంటారని అర్ధమవుతుంది అంటూ కామెంట్ లు చేయడం గమనార్హం.