రెడ్ టీజర్ వచ్చేసింది, రామ్ డబుల్ రోల్…!

-

ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తర్వాత రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం రెడ్. కాస్త మాస్ లుక్ లో ఈ సినిమాలో నటిస్తున్న రామ్ ఈ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నివేదా పెతురాజ్, మాళవిక శర్మ నటిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాకు స్రవంతి కిషోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా అధికారిక టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. స్రవంతి మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదల చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీజర్ ఆధారంగా చూస్తే సినిమా ఒక కేసు ఆధారంగా సినిమా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రామ్ కూడా ఈ టీజర్ ఓ డబుల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఫుల్ గడ్డంతో రామ్ కనిపిస్తున్నాడు ఈ సినిమాలో.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది. అలాగే రామ్ కూడా కాస్త కొత్తగా, బాడీ చూపించాడు. కొన్ని సీన్స్ హైలెట్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో రామ్ కొత్తగా కనిపిస్తాడని టీజర్ చెప్తుంది. షవర్ కింద స్నానం చేస్తున్న సీన్ హైలెట్ గా నిలిచింది. విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే టీజర్ లక్ష వ్యూస్ సాధించింది. ఈ సినిమా హిట్ అయితే రామ్ కి తిరుగు ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news