‘రామబాణం’ నుంచి అదిరిపోయే పోస్టర్

-

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించిన చిత్రయూనిట్‌ తాజాగా ఈ సినిమా నుంచి శ్రీరామ నవమి పోస్టర్‌ను విడుదల చేసింది. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కథని భూపతి రాజా, అందించగా, వెట్రి పళని స్వామి ఛాయాగ్రహణం, మిక్కీ జే మేయర్‌ సంగీతం, ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చనున్నాయి.

2023 వేసవి కానుకగా చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయనిచిత్ర నిర్మాతలు తెలిపారు. ఇతర ప్రధాన పాత్రల్లో , సచిన్‌ ఖేడ్‌ ఖర్‌, నాజర్‌, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్‌, సప్తగిరి,కాశీ విశ్వనాథ్‌, సత్య,గెటప్‌ శ్రీను, సమీర్‌, తరుణ్‌ అరోరా, తదితరులు నటిస్తున్నారు. 2023 వేసవి కానుకగా చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు చిత్ర నిర్మాతలు టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news