స్టార్ డైరెక్ట‌ర్ల‌ను లైన్‌లో పెడుతున్న రామ్‌చర‌ణ్‌.. త‌ర్వాత ఎవ‌రంటే?

-

మెగాస్టార్ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అంత‌టి స్టార్ హీరోగా ఎదిగాడు రామ్‌చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం ఆయ‌న పెద్ద డైరెక్ట‌ర్ల‌తోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే దర్శకధీరుడు రాజమౌళితో క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న చెర్రీ.. ఇంకోవైపు బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొరటాల శివతో చిరంజీవి మూవీ అయిన‌ ఆచార్యలో మెరుస్తున్నారు. అయితే ఈ రెండు మూవీలు కూడా మోస్ట్ వెయిటెడ్ గా తెర‌కెక్కుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ రెండూ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చాయి.

 

ఇదిలా ఉండ‌గా త‌న త‌ర్వాత సినిమాలు కూడా పెద్ద డైరెక్ట‌ర్ల‌తోనే ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. ఇప్ప‌టికే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంకర్ తో క‌లిసి ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కాకపోతే దీనికి ఇంకొంచెం టైమ్ ప‌ట్టేలా ఉంది. కానీ ఈ సినిమా మాత్రం ప‌క్కా పెద్ద ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోంది. దీనికి దిల్‌రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

అలాగే చెర్రీ త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల‌పై, రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాల‌పై ఫోక‌స్ పెడుతున్నాడు. ఇక రాజ‌మౌళితో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే ఆచార్యతో మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నాడు చ‌ర‌ణ్‌. ఇక త‌న‌కు రంగ‌స్థ‌లం లాంటి ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో కూడా ఓ మూవీ చేయ‌నున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. ఆ త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్లు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తోపాటు కొరటాల శివ డైరెక్ష‌న్‌లో మూవీలు ప్లాన్ చేస్తున్నాడు చ‌ర‌ణ్‌. ఇలా వ‌రుస‌పెట్టి స్టార్ డైరెక్ట‌ర్ల‌ను లైన్‌లో పెడుతున్నాడు చ‌ర‌ణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news