మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్.. తెలంగాణ రాజకీయాలనే ఓ మలుపు తిప్పింది. టీఆర్ఎస్ ను వీడిన ఈటల ఈ నెల 14న బిజేపి తీర్థం పుచ్చుకొనున్నారు. అయితే ఈటల పోవడమే గాక.. టీఆర్ఎస్ కుంపటిలో పెద్ద కల్లోలమే తెచ్చాడు. తనతో ఇతర టీఆర్ఎస్ నాయకులను తీసుకుపోతున్నాడు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద అలజడి మొదలైంది. అయితే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కీలక అనుచరుడు కూడా టిఆర్ఎస్ పార్టీని వీడనున్నాడని సమాచారం అందుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాల నేత అశ్వద్ధామ రెడ్డి కూడా ఈటల రాజేందర్ తో పాటు బిజెపిలో చేరబోతున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర అనుబంధ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి.. తెలంగాణ ఉద్యమం నుంచి మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అయితే ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట పట్టడంతో అశ్వద్ధామరెడ్డి.. టిఆర్ఎస్ పార్టీ మధ్య దూరం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈటల ఎపిసోడ్ కలిసి రావడంతో.. బిజెపిలోకి వెళ్లడమే సరైన మార్గమని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగానే మొన్న ఈటలతో కూడా అశ్వద్ధామ రెడ్డి భేటీ అయ్యారు. ఈనెల 14 తర్వాత అశ్వద్ధామ రెడ్డి బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నారు.