కొత్త కాంబో గురూ ! చెర్రీ తో సముద్ర ఖ‌ని వావ్ వావ్

-

‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానాలు, నందమూరి అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. వీరిద్దరిని వారి ఫ్యాన్స్ సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా ఏళ్లు అవుతోంది. ట్రిపుల్ ఆర్ సినిమా కోసమే ఎక్కువ కాలం పనిచేశారు. ఈనెల 25న వరల్డ్ వైడ్ గా ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతోంది. దీంతో అభిమానుల ఆకలి తీరనుంది.

ఇదిలా ఉంటే కొత్త కాంబినేషన్లలో రామ్ చరణ్ వరసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే మెగా డైరెక్టర్ శంకర్ తో ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ కావచ్చని టాక్. మరోవైపు ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతం తిన్ననూరితో ఇంకో సినిమా చేయనున్నాడట చరణ్. ఈ సినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మిగతా కాస్ట్ అండ్ క్రూ తెలయాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ప్రముఖ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు క్రేజీ వార్త వినిపిస్తోంది. ఇంతకుముందు పలు తమిళ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించాడు. అయితే తెలుగులో మాత్రం యాక్టర్ గానే సముద్ర ఖని పరిచయం. వీరిద్దరి కాంబోలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే చర్రీ ఫ్యాన్స్ కు పండగే ఇక.

Read more RELATED
Recommended to you

Latest news