త్వరలోనే రానా నాయుడు సీజన్ 2.. ఈ సారైనా వర్క్ అవుట్ అవుతుందా!

-

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. గత నెలలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ మిశ్రమ స్పందన అందుకుంది. అయితే తాజాగా రానా నాయుడు 2 త్వరలోనే రాబోతుంది అంటూ ప్రకటించింది ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్.

సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన హిందీ వెబ్ సిరీస్‌ రానా నాయుడు. ఇది ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డోనోవన్’కు ఇండియన్ అడాప్టేషన్‌గా తెరకెక్కింది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, రానా ప్రధాన పాత్రలో కనిపించారు. ఫస్ట్ సీజన్‌ గత నెలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌‌లో విడుదలైంది. కాగా ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు మిశ్రమ స్పందన ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో సైతం ఈ సిరీస్ కు పెద్దగా ఆదరణ దక్కలేదు.

 

బూతు పదాల పట్ల విమర్శలు రావడంతో ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌ను స్ట్రీమింగ్ నుంచి తొలగించింది నెట్‌ఫ్లిక్స్. కాగా ప్రస్తుతం మాత్రం త్వరలోనే ఈ సిరీస్ సెకండ్ సీజన్ ప్రారంభం కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించేసింది. ‘రానా నాయుడు’ సీజన్ 2 త్వరలోనే రాబోతుందని అధికారికంగా ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్ ఒక చిన్న గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేసింది.

మార్చి 10న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్.. విడుదలైన మూడు వారాల పాటు భారతదేశంలోనే అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌గా నంబర్.1 స్థానంలో నిలిచింది. వరుసగా ఐదవ వారంలోనూ దేశంలోని టాప్ 10 సిరీస్‌లలో ఒకటిగా రానా నాయుడు దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది సీజన్ 1. మరి సీజన్ 2కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news