బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో కెల్విన్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతుంది. నాలుగేళ్ళ క్రితం వెలుగులోకి వచ్చిన కేసు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈడీ ఈ కేసును విచారిస్తుంది. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ కోణంలో విచారణకు నోటీసులు పంపిస్తున్నారు. ఈ నేపథ్యం లోనే ఈ డ్రగ్స్‌ కే సు లో కెల్విన్‌ అనే వ్యక్తి ని కీలక నిందితుడి గా ఈడీ అధికారులు గుర్తించారు.

అంతేకాదు…ఇప్పటికే పలు మార్లు… కెల్విన్‌ ను విచారణ చేశారు ఈడీ అధికారులు. అయితే.. తాజాగా డ్రగ్స్ కేసులో కెల్విన్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9 న విచారణకు హాజరు కావాలని కెల్విన్ ను ఆదేశించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్ లో కెల్విన్ కు కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా… టాలీవుడ్ సెలెబ్రిటీలైన పూరి జగన్నాథ్, ఛార్మి, నవదీప్, రానా, రవితేజ, రకుల్‌, తనీష్‌, ముమైత్‌ ఖాన్‌ తదితరులు ఈ డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే ఈడీ విచారణ హజరయ్యారు.