తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అయితే… ఆయన కొడుకు కేటీఆర్… డ్రగ్స్ తీసుకునే వారికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ గజ్వేల్ నియోజక వర్గంలో నిర్వహించిన దళిత – గిరిజన దండోరా సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…కేసీఆర్ సీఎం అయితే.,, అభివృద్ధి జరుగుతుందని గజ్వేల్ ప్రజలు ఆశించారని… ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, 3 ఎకరాల పొలం, నిరుద్యోగ భృతి వస్తాయని ఆశించారన్నారు. కానీ కేసీఆర్ పేదల భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. 14 గ్రామాల ప్రజలను అనాథలను చేశారని… తెలంగాణ ఇస్తే.. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాకు మాట ఇచ్చి వెన్నుపోటు పొడితారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదన్నారు. కేసీఆర్ కుటుంబానికే మొత్తం పదవులు ఉన్నాయని.. కానీ 12 శాతం ఉన్న మాదిగలకు పదవులు లేవా ? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఆరోగ్య శ్రీ లో కరోనా చికిత్స చేర్చకుండా ఎంతో మంది ప్రాణాల్ని బలిగొన్నారని నిప్పులు చెరిగారు.