Ranveer Singh: ‘జోర్దార్’ బాడీ బిల్డింగ్..కొండలు పిండి చేసేలా రణ్‌వీర్ సింగ్ కండలు

-

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ .. ప్రజెంట్ క్రేజీ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ‘83’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ హీరో..ప్రస్తుతం ‘సర్కస్, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘జయేశ్ భాయ్ జోర్దార్’ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ఈ పిక్చర్ షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

ఈ సినిమా కోసం రణ్ వీర్ బాడీ బిల్డ్ చేయగా, అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశాడు. అవి నెట్టింట ట్రెండవుతున్నాయి. కొండలు పిండి చేసేలా ఉండే కండలు చూపుతూ రణ్ వీర్ సింగ్ రియల్ హీరోలా గా కనబడుతుండటం చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.

‘వావ్, ట్రెండింగ్, వెరీ హాట్ ’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలకు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే లైక్ కొట్టింది. ఈ సుందరి ‘సర్కస్’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.రణ్ వీర్ సింగ్ డంబెల్స్ తో దిగిన ఫొటోలనూ షేర్ చేశారు.

ఆ ఫొటోలను చూసి చూసి చెమటొచ్చేలా కష్టపడుతున్న దీపికా పదుకొణె మొగుడు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ సినిమాలో రణ్ వీర్ సింగ్ సరసన హీరోయిన్ గా తన భార్య దీపికా పదుకొణే నటించింది. ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ చక్కటి నటన కనబర్చాడు .జయేశ్ భాయ్ జోర్దార్ సినిమా వచ్చే నెల 13న విడుదల కానుంది.

https://www.instagram.com/p/CcVOIn7MPfB/

Read more RELATED
Recommended to you

Latest news