కేజీయఫ్ 2 ఓటిటి రిలీజ్ డేట్ కి ముహూర్తం ఖరారు..?

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీలో యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించగా, రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ వంటివారు నటించారు.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో ఈ గురువారం నాడు విడుదలైంది.కలెక్షన్ వైజ్ గా అదిరిపోయే ఓపెనింగ్స్ తో తొలిరోజే దుమ్ములేపింది.

ఇక ఓటిటి విషయానికి వస్తే కే జి ఎఫ్ చాప్టర్ టు చిత్రం థియేట్రికల్ రన్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటిటి లో విడుదల అవుతుందని సమాచారం.మే 13 ఉదయం 12 గంటల నుంచి ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుందట.కే జి ఎఫ్ 2 సినిమా మరో నెల రోజుల్లో ఓటిటి లో సందడి చేయనుంది.అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటనన రావాల్సి ఉంది.విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news