హత్యాచారాలు జరగకుండా ఉండాలంటే… తల్లితండ్రులు వారి వారి ఆడపిల్లలకు విలువలు నేర్పించాలని పలికాడు ఒక మూర్ఖుడు! ఆయనే యూపీ బీజేపీ ఎమెల్యే బల్లియ సురేంద్ర సింగ్. అదే దరిద్రం అనుకుంటే, అంతకుమించిన దైర్భాగ్యమైన ఘటన మరొకటి అదే రాష్ట్రంలో, అదే జిల్లాలో బాదితురాలి ఇంటికి తొమ్మిది పది కిలోమీటర్ల దూరంలో జరిగింది! దీంతో.. బీజేపీ నేతలు మరీ బరి తెగించేశారనే కామెంట్లు వెలువడుతున్నాయి!
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ లో దళిత యువతి హత్యాచారానికి గురి కావడంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశమంతా హాథ్రస్ నిందితులను, జరిగిన సంఘటనను అసహ్యించుకుంటున్న పరిస్థితి! ఈ సమయంలో ఆ నిందితులకు మద్దతుగా తాను ఉన్నాను.. అత్యాచారం చేసినవారి తరుపున తాను పోరాడతానంటూ బరితెగించి మీటింగ్ పెట్టాడు బీజేపీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే!
అవును… బాధితురాలి ఇంటికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో సామావేశం జరిగింది. సమావేశంలో మాట్లాడిన ఈ బీజేపీ నేత… “హత్యాచారానికి పాల్పడిన నిందితులకు అండగా నిలవాలి.. హత్యాచార నిందితులకు న్యాయం జరగాల్సిందే”అని గట్టిగా డిమాండ్ చేశాడు. అక్కడితో ఆగని ఈ బీజేపీ నేత మూర్ఖత్వం… “హత్యాచారానికి గురైన బాధిత యువతి కుటుంబంపైనా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలి” అని పట్టుబట్టేవరకు వెళ్ళింది! దీంతో… నిత్యం “రామ జపం” చేసే బీజేపీనేతల “రాక్షస లక్షణం” ఇదనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!!
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అద్భుతమైన పాలనలో భాగంగా… ఈ సమావేశానికి పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటుచేశారు! దీంతో దేశవ్యాప్తంగా బీజేపీపై విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి! బీజేపీ తిరోగమనానికి హాథ్రస్ సంఘటన పునాది కాబోతుందనేది విశ్లేషకుల మాట!