టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పదినెలల కుమార్తె వామికా కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో క్రిక్ క్రేజీ గర్ల్ అనే ఖాతాతో కోహ్లీ కుమార్తె వామికా కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. అయితే దీనికి కారణం విరాట్ కోహ్లీ షమీకి సపోర్ట్ చేయటం అని తెలుస్తోంది. ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో షమీ కాలవలనే ఎక్కువ రన్స్ ఇచ్చాడని…మన ఇండియా టీమ్ లో కూడా పాకిస్తానీ ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే దీనిపై న్యూజిలాండ్ తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ స్పందించారు.
దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. తమ సహచర ఆటగాడు కోహ్లీ కి అండగా ఉంటామని కోహ్లీ వ్యాఖ్యానించారు. దాంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయిన కొందరు మూర్ఖులు సోషల్ మీడియా వేదికగా కోహ్లీపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆటను ఆటగా చూడాలని… కోహ్లీ నచ్చకపోతే ఆయనపై విమర్శలు చేయవచ్చని కానీ ఇతర అంశాల ఆధారంగా ఆటగాళ్లను.. కుటుంబ సభ్యులను ట్రొల్ చేయడం..హెచ్చరికలకు పాల్పడడం దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా కేవలం పది నెలల కోహ్లీ కూతురుపై ఇలాంటి బెదిరింపులు చేయడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.