అల్లు అర్జున్‌ కు షాక్‌ : తెలంగాణ ఆర్టీసీకి క్షమాపణలు చెప్పిన రాపిడో !

-

ఎట్ట కేలకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ అనుకున్నది సాధించింది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులపై తాజాగా స్పందించిన రాపిడో సంస్థ… తెలంగాణ ఆర్టీసీకి క్షమాపణలు చెప్పింది. అంతేకాదు… తెలంగాణ ఆర్టీసీ సీటీ బస్సును ఉపయోగించుకొని యాడ్ లో చిత్రీకరించిన సన్నివేశాలు తొలగించింది రాపిడో సంస్థ. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది రాపిడో సంస్థ.

తెలంగాణ ఆర్టీసీ సంస్థను కించ పరిచేందుకు..ఆ యాడ్‌ చేయలేదని… కానీ.. ఇప్పుడు ఆ యాడ్‌ లోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించినట్లు ప్రకటించింది. కాగా.. రెండు రోజుల కింద… అల్లు అర్జున్‌, రాపిడో సంస్థ కు నోటీసులు జారీ చేశారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తెలంగాణ ఆర్టీసీని కించ పరిచేలా… రాపిడో యాడ్‌ ఉందని… అందులో నటించిన అల్లు అర్జున్, రాపిడో సంస్థ తక్షణమే క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అయితే..తాజాగా దీనిపై స్పందించిన రాపిడో ఆ సన్నివేశాలను తొలగించింది.

Read more RELATED
Recommended to you

Latest news