RAPO19 : ”వారియర్‌” గా వచ్చేసిన రామ్‌.. పోలీస్‌ గెటప్‌ లో దుమ్ములేపాడుగా

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్‌ పోతినేని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. స్టైలిష్ గా కనిపిస్తూనే… మాస్ పాత్రలతో అలరించే హీరో రామ్ పోతినేని. దర్శకుడు లింగుస్వామి కూడా సినిమాలకు పెట్టింది పేరు. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.

ఇక rapo19 పేరుతో తెరకెక్కతున్న ఈ సినిమాలో ఉప్పెన తో ఆకట్టుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఊర మాస్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది సినీ బృందం. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. apo19 పేరుతో తెరకెక్కతున్న ఈ సినిమాకు ”ది వారియర్‌” అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. అలాగే ఈ సినిమాలో రామ్‌ పోలీస్‌ గెటప్‌ నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ అప్డేట్‌ తో రామ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news