విద్యాసంస్థలకు సెలవులు పెంచాలి..జగన్‌ కు లోకేష్‌ లేఖ

-

సీఎం జగనుకు నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున్న విద్యా సంస్థల సెలవులు పొడిగించాలని లోకేష్ కోరారు. ఏపీలో థర్డ్ వేవ్ ఉధృతమవుతోంది.. విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని లేఖలో డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని… తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయని గుర్తు చేశారు.

15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని.. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని హెచ్చరించారు. గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని… పోయిన పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుండి 5 వేల కేసులు నమోదయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని.. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురిచెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలన్నారు. తక్షణమే స్కూల్స్ కి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news