స్టేజ్ పైనే బూతులతో రెచ్చిపోయిన రష్మీ గౌతమ్..!

-

యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక వైపు సినిమాలు మరొకవైపు బుల్లితెర షోలు అంటూ నానా రచ్చ చేస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు బూతు కామెంట్లు కూడా చేస్తూ మరొకసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు జబర్దస్త్ స్కిట్స్ లో అడల్ట్ జోక్స్ బీభత్సం గా ఉండేవి.. వాటిని ఒక వర్గం వారు విపరీతంగా ఎంజాయ్ చేసేవారు. కానీ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని జోక్స్ వివాదాస్పదం కూడా అయ్యాయి. సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కంటెంట్ విషయంలో మల్లెమాల సంస్థ కొన్ని పరిమితులను కూడా విధించింది..

భూతు పదాలతో కూడిన డబుల్ మీనింగ్ జోక్స్ అసలే వద్దని టీం లీడర్స్ కి సూచించారు.. ఇకపోతే గత టీం లీడర్స్ మాదిరి నాన్ స్టాప్ హాస్యం పండించలేకపోతున్నారు. ఈ క్రమంలోని మరల అడల్ట్ జోక్స్ ని జబర్దస్త్ మేకర్స్ నమ్ముకున్నారని అనిపిస్తోంది. తాజాగా యాంకర్ రష్మీ కొట్టిన పంచ్ డైలాగు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది.. భార్యాభర్తల స్కిట్ లో. భర్త .. ” పిల్లలు పుట్టాలంటే ఇలా కంచానికి దగ్గరగా ఉంటే కుదరదు” అని అన్నాడు. భర్త పాత్ర చెప్పిన డైలాగ్ ని అందుకుంటూ రష్మీ..” పిల్లలు పుట్టాలంటే మంచానికి దగ్గరగా ఉండాలని” గట్టిగా అరిచింది..

పిల్లలు పుట్టడం , మంచం అంటూ బోల్డ్ పదాలు వాడడంతో రష్మీ నోటి నుండి ఈ రేంజ్ బోల్డ్ జోక్స్ అంచనా వేయలేదని నేటిజన్స్ వాపోతున్నారు. అయితే టిఆర్పి రేటింగ్ కోసం హద్దులు చెరిపేసారని చెప్పడంలో సందేహం లేదు.. ఇకపోతే సినిమాలలో రష్మీ గౌతమ్ కు అవకాశాలు వస్తున్న ఆమె ఈటీవీ , మాటీవీ అంటూ బుల్లితెరకే పరిమితమైంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కొత్త షోలో కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news