ఫ్యాక్ట్ చెక్: రిజర్వ్ బ్యాంకు లక్కీ డ్రా.. రూ.25,00,000 గెలిచే ఛాన్స్..?

-

సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో తరచూ మనకి నకిలీ వార్తలు కనపడుతూనే ఉంటాయి. చాలా మంది ఇటువంటి నకిలీ వార్తలని చూసి మోసపోతూ ఉంటారు. ఏది ఏమైనా ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాజాగా సోషల్ మీడియా లో మరొక వార్త వచ్చింది. మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక లక్కీ డ్రా ని కండక్ట్ చేస్తుందని… ఆ లక్కీ డ్రా ద్వారా 25 లక్షల రూపాయలను గెలుచుకునే అవకాశాన్ని పొందచ్చని అందులో ఉంది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఈ వార్త తెగ షికార్లు కొడుతోంది. మరి నిజంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్కీ డ్రా ని కండక్ట్ చేస్తుందా..?

ఇది ఎంతవరకు నిజం అనేది తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి లక్కీ డ్రా ని కండక్ట్ చేయడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త కేవలం నకిలీ వార్త మాత్రమే. 25 లక్షల రూపాయలని లక్కీ డ్రా ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం లేదు. ఇది వట్టి స్కామ్ మాత్రమే.

సోషల్ మీడియాలో వస్తున్న ఈ మెసేజ్ లకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి సంబంధం లేదు ఇటువంటి మెయిల్స్ ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపడం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ దీని పైన స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. ఇలాంటి నకిలీ వార్తలకి దూరంగా ఉండకపోతే మీరే నష్టపోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news