నాగశౌర్య ఘటనపై రష్మి రియాక్షన్.. ఆ కామెంట్స్‌ చూస్తే సిగ్గుగా ఉందంటూ ఫైర్

-

ఓ యువకుడు తన లవర్​ను నడిరోడ్డుపై కొట్టడం చూసి హీరో నాగశౌర్య స్పందించాడు. ఆమెకు సారీ చెప్పమని యువకుడిపై ఫైర్ అయ్యాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు స్పందించిన తీరుపై యాంకర్ రష్మి ఫైర్ అయింది. ఆ అమ్మాయి ఎలాంటి బాధను అనుభవిస్తుందో ఎవరికి తెలుసు అంటూ వ్యాఖ్యానించింది.

‘లవర్స్‌ అన్నాక వంద ఉంటాయి. వాళ్ల విషయాల్లో తల దూర్చడం అవసరమా?’ అంటూ నెటిజన్లు చేసిన వ్యాఖ్యలపై తాజాగా రష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాడి లవర్‌ వాడి ఇష్టమట.. అమ్మాయే సపోర్ట్‌ అట.. ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్‌ చూస్తే సిగ్గుగా ఉంది. ఆ అమ్మాయి ఎలాంటి ఒత్తిడిని అనుభవిస్తుందో ఎవరికి తెలుసు. మరో ఆత్మహత్య జరగడం కోసం మీరు ఎదురుచూస్తున్నారా?’’ అని ఆమె ట్వీట్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news