నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రష్మిక మందన కు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ సాధించాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక మందనా అగ్రహీరోయిన్ గా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా తన పెళ్లిపై రష్మిక సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చిన వాడితోనే కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తారని స్పష్టం చేశారు. ఆమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను మహిళలు పెద్ద సంఖ్యలో ఆదిరస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఆదరణ పొందుతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేసింది ఈ భామ.