RASHMIKA MANDANNA : పుష్ప నుంచి బిగ్ అప్డేట్..రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చలో సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన… తెలుగు తెరపై లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. కన్నడ బ్యూటీ అయినా… వరుస హిట్స్ కొట్టేస్తూ… దర్శకనిర్మాతలకు బెటర్ ఛాయిస్ అవుతోంది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు , భీష్మ లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని హవా నడిపిస్తోంది ఈ బ్యూటీ.

ఇది ఇలా ఉండగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి లో జరుగుతోంది.

ఇందులో భాగంగానే.. ఇప్పటికే రాజమండ్రి లో జరుగుతున్న షూటింగ్ ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియా లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇవాళ ఈ రష్మిక మందాన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ లో… రష్మిక మందన్నా చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది. చెవులకు కమ్మలు పెట్టుకుంటూ.. తన అందాలను ఆరబోసింది రష్మిక. ఇక రష్మిక లుక్ విడుదల కావడం తో ఆమె ఫాన్స్ లో కోలాహలం నెలకొంది.   కాగా ఈ మూవీ పార్ట్ -1 ను ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 25 వ తారుఖున అన్నీ థియేటర్ల లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news