ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మి పార్వతి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శులు కురిపించారు. పవన్ కల్యాణ్ పాదయాత్ర చేస్తే ఎక్కువ మంది ప్రజలు కనిపిస్తే కారు ఎక్కుతాడంటూ ఆరోపించారు. పవన్ సొంతంగా ప్రజల్లోకి వెళితే తప్ప నాయకుడు కాలేడని లక్ష్మి పార్వతి వ్యాఖ్యానించారు. విష వృక్షంలో ఉన్నంతకాలం పవన్ ఎదగలేడని అన్నారు. చంద్ర బాబు తన రెండు కండ్ల సిద్దాంతాన్ని మాను కోవాలని లక్ష్మీ పార్వతి సంచలన వ్యాక్యలు చేశారు.
అంతే కాకుండా జగన్ ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేశారని..పవన్ కల్యాణ్ అలా పాదయాత్ర చేయగలరా అని ప్రశ్నించారు. అసలు పవన్ సిద్దాంతం ఏంటో ఆయనకు అయినా తెలుసా…ఓ సారి టీడీపీతో మరోసారి కమ్యూనిస్టులు, బీజేపీలతో పొత్తు పెట్టుకుంటాడని అన్నారు. సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆన్లైన్ టికెట్ల పై ఓ నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. కానీ పవన్ కల్యాణ్ దొంగ టికెట్ల అమ్మకాలకు సపోర్ట్ చేస్తే నాయకుడివి ఎలా అవుతావంటూ ప్రశ్నించారు.