టాలీవుడ్, కోలీవుడ్ లలో ఫేం సంపాదించుకున్న నేషనల్ క్రష్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ను పక్కకునెట్టి ఫుల్ క్రేజ్ సంపాదించింది. త్వరలో రష్మిక తొలి బాలీవుడ్ ఫిల్మ్ ‘గుడ్ బై’ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక ముంబయిలో వరుస షూటింగ్స్ లో పాల్గొంటోంది.
‘గుడ్ బై’ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లిన రష్మికను ఓ అభిమాని ఆటోగ్రాఫ్ అడిగాడు. ‘ఎక్కడ సంతకం చేయాలి’ అన్నట్లు ఆమె చూస్తే.. తన గుండెలపై చేయమని ఛాతి చూపించాడు అభిమాని. మొదట రష్మిక సందేహించినా.. చివరకు, అతడి వైట్ టీ షర్టుపై గుండెల దగ్గర సంతకం చేశారు.
ఆ మధ్య ముంబైలో రష్మిక ఒక గుడికి వెళితే.. అభిమానులు చుట్టుముట్టారు. అక్కడ నుంచి రోడ్డు మీదకు ఆమె కారు రావడానికి చాలా సమయం పట్టింది. ఒక దశలో తన ఫ్లైట్ మిస్ అవుతానని రష్మిక కూడా అనుకున్నారు. ముంబయిలో ప్రేక్షకులు ఆమెపై అంతలా అభిమానం చూపిస్తున్నారు.
#rashmikamandanna Big Fan Got Signature 😍💃📷 @viralbhayani77 pic.twitter.com/xBWEmsPcZa
— Viral Bhayani (@viralbhayani77) September 26, 2022