2014 కు ముందు పద్మశాలీలను ఎందుకు పట్టించుకోలేదు? – మంత్రి తలసాని

-

జలదృశ్యంలో ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహా నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం తన పదవులను త్యాగం చేసారని.. నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అడ్వకేట్ గా ఎంతో కృషి చేసారని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొండా లక్ష్మణ్ బాపూజీకి గుర్తింపు లేకుండా పోయిందన్నారు. స్వరాష్ట్రంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రస్తుతం లీడర్లు ఎక్కువ అయిపోయారు.. అందరూ స్టేజ్ మీదనే ఉండాలనుకుంటే ఎలా.? అంటూ అక్కడ ఉన్న నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. వచ్చే ఏడాది కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు దేశమంతా గర్వపడే విధంగా చేస్తామన్నారు.

చేనేతల కోసం ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ జెండాలను చైనా నుంచి తెప్పించుకుంటే.. మనం మన నేతన్నతో తయారు చేయించామని తెలిపారు. 2014 ముందు నాయకులు లేరా.? ఎందుకు పద్మశాలీలను పట్టించుకోలేదు.? పని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version