నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. FCIలో 5043 పోస్టులు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూరి వివరాలను చూస్తే.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐదు వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తోంది. అప్లై చేసుకునేందుకు చివరి తేదీ 5 అక్టోబర్ 2022. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

AG-III , AG-II, స్టెనో గ్రేడ్ II పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది కనుక అప్లై చేసుకోవచ్చు. ఇక అర్హత వివరాలను చూస్తే.. AG-III (టెక్నికల్) కి అగ్రికల్చర్/బోటనీ/బయాలజీ/బయోటెక్/ఫుడ్‌లో డిగ్రీ చేసుండాలి. AG-III (జనరల్) కి అయితే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కావాలి.

AG-III (అకౌంట్స్) కి అయితే బీకామ్ చేసుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కావాలి.AG-III (డిపో) కి కూడా డిగ్రీ ఉండాలి. JE (EME) కి EE/ME ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. సంవత్సరం అనుభవం కూడా. JE (సివిల్) కి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి.

హిందీ టైపిస్ట్ AG-II కి హిందీ టైపింగ్ తో పాటు డిగ్రీ ఉండాలి. అదే విధంగా స్టెనో గ్రేడ్-II కి టైపింగ్, స్టెనో వర్క్ వచ్చి ఉండాలి. వయస్సు కనీసం 21 – 28 ఉండాలి. అభ్యర్థులు fci.gov.in వెబ్‌సైట్‌ను చూసి వివరాలను పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version