Rashmika Mandanna : ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌ల‌కు షాకింగ్ ఇచ్చిన రష్మిక ! ఆ లిస్ట్ టాపర్!

Rashmika Mandanna : రష్మిక మందన్నా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఈ కన్నడ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్, డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ.. ఇతర హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతోంది. ఇటు సినిమాతోనే కాదు.. సోషల్ మీడియా లోనూ పాపులారిటీ ఉంది.

ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తూ.. ఎక్కువగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఫాలోవర్స్‌కు దగ్గరగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ హీరోయిన్‌కు లేనంతమంది ఫాలోవర్స్ పెంచుకుంది. ఆ కౌంట్ రోజురోజుకీ పెరుగుతోంది కూడా. ఈ క్ర‌మంలో అమ్మడు క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది.

వివ‌రాల్లోకెళ్లే.. రీసెంట్‌గా ఫోర్బ్స్ విడుద‌ల చేసిన లిస్టులో ర‌ష్మిక మంద‌న్న ద‌క్షిణాది స్టార్ హీరోహీరోయిన్లను క్రాస్ చేసి అగ్ర‌స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌,
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్‌, యంగ్ టైగ‌ర్ జూ. ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్‌, విజయ్ దేవరకొండ
ధ‌నుశ్‌, త‌మ‌న్నా, స‌మంత ల‌కు షాక్ ఇచ్చింది.

ఇక ఫోర్బ్స్ రాంక్యుల జాబితా ఇలా ఉంది…
1. ర‌ష్మిక మంద‌న్న‌- 9.88 పాయింట్లు
2. విజ‌య్ దేవ‌ర‌కొండ – 9.67,
3. య‌ష్ – 9.54,
4.స‌మంత – 9.49,
5. అల్లు అర్జున్ – 9.46,
6. దుల్క‌ర్ స‌ల్మాన్ – 9.42,
7. పూజా హెగ్డే – 9.41,
8. ప్ర‌భాస్ – 9.40,
9. సూర్య – 9.37,
10. త‌మ‌న్నా – 9.36,
11.మ‌హేశ్ – 9.34,
12. రామ్ చ‌ర‌ణ్ – 9.33,
13. ధ‌నుశ్ – 9.33,
14.ఎన్టీఆర్ – 9.31

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే .. ఈ అమ్మ‌డు చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. టాలీవుడ్లో పుష్ప‌తో సంద‌డి చేయ‌డానికి రెడీగా ఉంది. అటు బాలీవుడ్‌లో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.. మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై చిత్రాల్లో న‌టిస్తోంది.