బ‌న్నీ `పుష్ప‌` సినిమాలో రష్మిక పాత్ర అదేన‌ట‌..!!

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్ తెర‌కెక్కుతున్న చిత్రం `పుష్ప‌`. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించే లారీ డ్రైవర్ గా పుష్పక్ నారాయణ పాత్ర‌ను బ‌న్నీ పోషిస్తున్నాడు. ఇక ఇటీవల బ‌న్నీ బ‌ర్త్‌డే కానుక‌గా ఫ్యాన్స్ కోసం ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను రిలీజ్ చేశారు.

దీంతో ఆ రోజంతా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా స్టైలిష్ స్టార్ ద‌ర్శ‌న‌మించాడు. ఇక అప్ప‌టినుంచి ఈ సినిమా గురించి కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలోని ర‌ష్మిక పాత్ర గురించి ఓ ఇంట్రిస్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో రష్మిక ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌న్నిటికి పూర్తి భిన్నంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆమె ఒక గిరిజన యువతిగా సీన్‌లోకి ఎంటరవుతుందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

అంతేకాకుండా.. కథ పాకాన పడుతుండగా ఆమె పాత్రలో ట్విస్ట్ ఆడియన్స్ కి షాక్ ఇస్తుందని అంటున్నారు. మ‌రి ర‌ష్మిక ఈ సినిమాలో గిరిజ‌న అమ్మాయిగా ఎంత వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాలి. కాగా, ప్ర‌స్తుతం ర‌ష్మిక వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోంది. ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైనా ఈ బ్యూటి చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ చెంత చేరేంది. ఇక ఇటీవ‌ల స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో సూప‌ర్ హిట్ మంచి జోరు మీద కొన‌సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news