అమ్మో రష్మిక అంతొద్దు … చాలా ఎక్కువ చేశావ్ !

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటించిన ‘అఆ’ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత నితిన్ నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా చేయటం జరిగింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయింది. దీంతో చాలా రోజుల తర్వాత నితిన్ సినిమాకి మొట్ట మొదటి రోజు పాజిటివ్ టాక్ ‘భీష్మ’ సినిమా సొంతం చేసుకుంది.Image result for rashmika mandanna

సినిమాలో కామెడీ మరియు రష్మిక మందన – నితిన్ జంటల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ సన్నివేశాలు సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సరిగ్గా రెండు రోజుల క్రితం భీష్మ సినిమా రిలీజ్ అవ్వకముందు సినిమా యూనిట్ భీష్మ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

 

ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో హీరోయిన్ రష్మిక ఓవరాక్షన్ ఎక్కువగా చేసిందని..నెటిజన్లు వీడియో ఫైల్స్ సెటైరికల్ గా కామెంట్ చేస్తున్నారు. అమ్మో రష్మిక అంతొద్దు … చాలా ఎక్కువ చేశావ్ ప్రీ రిలీజ్ వేడుకలో మీ స్పీచ్ చాలా ఎక్కువ టైం పట్టింది..ఇక వీడియో లో కూడా నీ ఓవరాక్షన్ ఆపవా అంటూ నెటిజన్లు ఈ వీడియోపై భయంకరమైన కామెంట్లు చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news