సుజనా కి జరిగింది తెలిసి బెంగ పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ?

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి చాలా దయనీయంగా మారింది. 2019 ఎన్నికల రిజల్ట్ తో టిడిపి పునాదులు కదిలి పోయేటట్టు ప్రస్తుత పార్టీ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి పూర్తి విధేయుడిగా ఉండే సుజనా చౌదరి ని స్వయంగా చంద్రబాబు ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన తరువాత బిజెపి పార్టీలోకి పంపించడం జరిగింది. దీంతో జగన్ అధికారంలోకి రావడంతో చంద్రబాబు రాజకీయంగా అనేక ఎదురుదెబ్బలు మరియు తీవ్ర ఇబ్బందులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు.Image result for suajana chowdary chandrababu

చాలా వరకు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి రోజుకొకటి బయట పడుతున్న తరుణంలో ఐటీ దాడులు ఇటీవల జరిగిన సమయంలో బాబు మాజీ పీఏ శ్రీనివాస్ చౌదరి వద్ద రెండు వేల కోట్లు దొరకటం ఇటు రాష్ట్రంలో అటు జాతీయస్థాయిలో పెద్ద ఇష్యూ గా మారింది. దీంతో కేసు ఉన్న కొద్దీ తనపైకి వస్తుందేమో అని భయాందోళనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

 

ఇటువంటి సమయంలో బీజేపీ లో ఉన్న సుజనా చౌదరికి చెన్నై లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నుండి నోటీసులు రావటం జాతీయ స్థాయిలో మరియు ఇటు ఆంధ్రాలో కూడా ఈ విషయం పెద్ద హైలెట్ అయ్యింది. బ్యాంకు నోటీసులకు సుజనా చౌదరి ఎప్పటినుండో స్పందించకపోవడంతో తాజాగా వచ్చిన నోటీసులతో పాటు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ కూడా జారీ చేసినట్లు సమాచారం.

ఇటువంటి తరుణంలో బీజేపీలోకి పంపించిన సుజనా చౌదరి ద్వారా కేంద్రం నుండి వచ్చే ఒత్తిడిని సమస్యలను తప్పించుకోవాలని వేసిన చంద్రబాబు ఎత్తుగడ కి.., తాజాగా గతంలో సుజనా చౌదరి మోసం చేసిన బ్యాంక్ నోటీసులు మరియు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వటం తో బిజెపి నుండి కూడా సుజనా చౌదరి కి సరైన సపోర్ట్ రావటం లేదట. దీంతో చంద్రబాబు బీజేపీ లోకి వెళ్తేనే సేవ్ అవ్వలేదు ఇక నా పరిస్తితి ఏంటి అని బెంగ పెట్టుకున్నట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Latest news