అద్భుత‌మైన ఫీచర్ల‌తో విడుద‌లైన టెక్నో పోవా స్మార్ట్ ఫోన్‌.. త‌క్కువ ధ‌ర‌కే ల‌భ్యం..

-

ట్రాన్స్‌ష‌న్ ఇండియా కంపెనీ టెక్నో సిరీస్‌లో నూత‌నంగా టెక్నో పోవా పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. పోవా సిరీస్‌లో కొత్త‌గా వ‌చ్చిన ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.8 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డాట్ ఇన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెస‌ర్ ను ఏర్పాటు చేశారు. 6జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. వెనుక వైపు 16, 2, 2 మెగాపిక్స‌ల్ కెమెరాల‌తోపాటు మ‌రో ఏఐ కెమెరాను ఏర్పాటు చేశారు.

Tecno POVA smart phone launched in india

ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇందులో అందిస్తున్నారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తోంది.

టెక్నో పోవా స్పెసిఫికేష‌న్స్‌…

* 6.8 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1640 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్
* 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 16, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

టెక్నో పోవా స్మార్ట్ ఫోన్ స్పీడ్ ప‌ర్పుల్‌, డాజిల్ బ్లాక్‌, మ్యాజిక్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.9,999గా ఉండ‌గా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.11,999గా ఉంది. డిసెంబ‌ర్ 11 నుంచి ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో ల‌భిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news