ఈ నెల 7న రవితేజ తాజా చిత్రం ‘రావణాసుర’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే… ఈ సినిమా ప్రీ రిలీజ్ శిల్పకళా వేదికపై జరుగుతుంది. కాగా, ఈ సినిమాలో హైపర్ ఆది ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో ఆయన మాట్లాడుతూ .. “ఒక వ్యక్తి అలా సినిమాలు చేస్తూ ఎదిగితే ఆయనను సినిమా హీరో అంటారు. అదే తాను ఎదిగి పదిమందిని పైకి లాగితే రియల్ హీరో అంటారు. అలాంటి రియల్ హీరో రవితేజ” అన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ ఉన్నంత కాలం టాలెంట్ ఉన్నవారు ఎవరైనా ఎర్రబస్సు ఎక్కి వచ్చేయవచ్చు. కష్టపడితేనేగాని రోజు గడవని చాలామంది సినిమావాళ్లు ఉన్నారు.
వాళ్లందరికీ రోజూ అవకాశాలు ఉండాలనే ఆయన రోజూ కష్టపడుతున్నాడు. అలాంటి రవితేజకి మనమంతా థ్యాంక్యూ చెప్పుకోవాలి. ఒక్క కరోనా విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోను పాజిటివ్ నెస్ కోరుకునే వ్యక్తి ఆయన” అని చెప్పాడు. “ఈ సినిమా టైటిల్ ‘రావణాసుర’ .. రావణుడికి పది తలలు ఉంటాయి. తలకి 10 కోట్లు వేసుకున్నా ఈజీగా ఈ సినిమా 100 కోట్లను రాబట్టేస్తుంది. వరుసగా 100 కోట్లను రాబట్టిన 3 సినిమాగా ఇది నిలవడం ఖాయం.