ఇదంతా మీరు ఇచ్చిన ఎనర్జీనే : హీరో రవితేజ

-

నేడు హైదరాబాదులోని శిల్పకళా వేదికలో జరిగిన ‘రావణాసుర’. ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ… నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర చేసిన సినిమానే ‘రావణాసుర’. అన్నారు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై రవితేజ “తమ్ముళ్లూ నా ఉత్సాహం .. ప్రోత్సాహం మీరే. ఇదంతా మీరు ఇచ్చిన ఎనర్జీనే. ఈ సినిమాలో నా డాన్సులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు కారణం శేఖర్ మాస్టర్” అని చెప్పారు. ఈ సినిమాలో భీమ్స్ ఒక పాట చేశాడు .. అది గొప్పగా వచ్చింది. మిగతా పాటలను హర్షవర్ధన్ రామేశ్వర్ చేశారు.

Ravanasura Pre Release Event

ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మా హీరోయిన్స్ అంతా తెరపై చాలా బ్యూటిఫుల్ గా సందడి చేశారు. ఈ సినిమా తరువాత నాతో ఆది కాంబినేషన్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది” అని అన్నారు. “ఇక సుశాంత్ తో చేసిన ప్రతి సీన్ ను నేను ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో మీరంతా కొత్త సుశాంత్ ను చూస్తారు. ఈ సినిమా తరువాత దర్శకుడిగా సుధీర్ వర్మ నెక్స్ట్ లెవెల్ కి వెళతాడు. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news