ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రవిశాస్త్రి

-

ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుండి హార్థిక్ పాండ్యని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే హర్డిక్ పాండ్య ని కెప్టెన్గా ప్రకటించిన నాటి నుండి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముంబైకి కెప్టెన్గా రోహిత్ శర్మ మరో సంవత్సరం పాటు ఉంటే బాగుండేదనీ కొందరు అభిమానులు అంటుంటే మరికొందరు ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ముందే రోహిత్ కి తెలియజేసి గౌరవంగా అతని ద్వారానే కెప్టెన్ గా తప్పుకొమ్మని చెప్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముంబై కెప్టెన్సీ మార్పుపై టీమ్ ఇండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందించారు. ‘రోహిత్, హార్దిక్ కెప్టెన్సీల వ్యవహారంలో ఇంకా బెటర్గా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ ఎవరిని కెప్టెన్ చేయాలనేది యజమానుల నిర్ణయం అని అన్నారు. వాళ్లే డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి వాళ్లిష్టం’ అని తెలిపారు. కాగా, ముంబై సారథిగా ఎవరు ఉండాలని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన పోలింగ్లో రోహిత్కు 85%, పాండ్యకు 15% ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్లలో ఓటమిపాలైంది.

Read more RELATED
Recommended to you

Latest news