శ్రీ లీల పై వైరల్ కామెంట్స్ చేసిన రవితేజ..!!

-

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో శ్రీ లీల దూకుడు మామూలుగా లేదు. తాను పెళ్లి సందడి తో రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో గ్లామర్ గా కనిపించి ప్రేక్షకులను అమితంగా అలరించింది. ఈ సినిమా లో ఆమె డాన్స్ లకు జనాలు ఫిదా అయిపోయారు. ఇక ఆ ఊపులో ఆమె రెండో సినిమాకే కోటిరూపాయల తీసుకొనే రేంజ్ కు వెళ్లి పొయింది.

ఇక అమ్మడు వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ ట్రెండింగ్ ఉంది. తనకోసం స్టార్ హోటల్స్ వంటి అన్ని సదుపాయాలు కల్పించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా మాస్ మహారాజ్ నటించిన ధమాకా సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.డిసెంబర్ 23న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ శ్రీ లీల ను ఆకాశానికి ఎత్తేశాడు.శ్రీలీల లో సూపర్ హుషారు, ఎనర్జీ, ట్యాలెంట్ ఉంది అన్నాడు అలాగే వచ్చే ఏడాది ఇదే సమయానికి శ్రీలీల కెరీర్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అప్పుడు ఆమె నా సినిమాకి డేట్లు ఇస్తుందో లేదో అంటూ రవితేజ పొగడ్తలు వర్షం కురిపించాడు. రవితేజ అన్నట్టుగానే శ్రీ లీల కెరియర్ లో దూసుకొని పోతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news