Unstoppable : బాలయ్య షోకు జయసుధ, జయప్రద..ఎపిసోడ్ ఎప్పుడంటే ?

-

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా రెండవ సీజన్ ను ప్రారంభించడం జరిగింది. ఇందులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేష్ మొదటి ఎపిసోడ్లో గెస్ట్ గా వచ్చి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుసగా సూపర్ స్టార్లు వస్తూనే ఉన్నారు.

ఇక తాజాగా అలనాటి హీరోయిన్లు జయప్రద, జయసుధ కూడా ఈ షోకు హాజరు అయ్యారు. జయప్రద, జయసుధతో పాటు, రాశి ఖన్నా కూడా ఈ షోకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా ఆహా సంస్థ రిలీజ్‌ చేసింది. బాలయ్యతో ఈ ముగ్గురు తారలు డాన్స్‌ చేసిన ఫోటోలను కూడా విడుదల చేసింది ఆహా. అయితే, ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్‌ కానుందో మాత్రం ప్రకటించలేదు. కాగా, ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news