కరీంనగర్ జిల్లా లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తారా స్థాయి కి చేరుకున్నాయి. విమర్శల నుంచి సవాల్ల వరకు చేరింది. తాజా గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్థార్ రవీందర్ సింగ్ గెలిస్తే తాను మేయర్ పదవి కి రాజీనామా చేస్తానని సునీల్ రావు సవాల్ విసిరారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఓడి పోవడం ఖాయం అని అన్నారు. ఒక వేళ రవీందర్ సింగ్ గెలిస్తే టీఆర్ఎస్ నుంచి నైతిక బాధ్యత వహిస్తూ కరీంనగర్ మేయర్ పదవి కి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
అయితే కరీంనగర్ జిల్లా లో ప్రజా ప్రతినిధులు అందరూ కూడా అధికార పార్టీ వైపే ఉన్నారని అన్నారు. రవీందర్ సింగ్ వైపు ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు. అయితే కరీంనగర్ జిల్లా లో ప్రతి సారి కన్నఈ సారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మాజీ మేయర్ రవీందర్ సింగ్.. టీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తం గా ఈ ఫలితాలపై ఆసక్తి నెలకొంది.