కోహ్లీ తొలగింపు సిగ్గు చేటు.. బీసీసీఐకి పారదర్శకత లేదు

-

టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించడంపై అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ మండిపడ్డారు. బీసీసీఐ, సెలెక్టర్లకు పారదర్శకత లేదని, కెప్టెన్సీ మార్పు విషయంలో సందేహాస్పందంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విరాట్ కోహ్లీ స్థానంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగిస్తూ డిసెంబర్ 8న చేతన్ శర్మ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నది.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముగియగానే పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకమీదట వన్డే, టెస్టు జట్లకు మాత్రమే నాయకత్వం వహించాలనుకుంటున్నట్లు తెలిపారు.

టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లీ స్వయంగా ప్రకటించినా వన్డేల విషయంలో అతని అభిప్రాయం లేకుండానే సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.

విరాట్ కోహ్లీతో సంప్రదించడానికి తాను ప్రయత్నించానని, కానీ లాభం లేకపోయిందని రాజ్‌కుమార్ శర్మ వెల్లడించారు. అయితే, టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేసిన సమయంలో తన నిర్ణయం కోహ్లీ స్పష్టతతో ఉన్నారని పేర్కొన్నారు.

నేను అతడి(విరాట్ కోహ్లీ)తో మాట్లాడలేకపోయాను. కొన్ని కారణాల రీత్యా కోహ్లీ ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్‌‌లో ఉన్నది. కానీ, నా అభిప్రాయం ప్రకారం టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ వైదొలిగాడు. అయితే, వెంటనే సెలెక్టర్లు అతడిని వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా వైదొలగమని కోరాల్సింది. లేదా ఏ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగవద్దని సూచించాల్సింది అని రాజ్ కుమార్ శర్మ పేర్కొన్నారు.

టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని బీసీసీఐ కోరిందని చైర్మన్ సౌరవ్ గంగూలీ ప్రకటించడంపై రాజ్‌కుమార్ విస్మయం వ్యక్తం చేశారు. ఇటీవల సౌరవ్ గంగూలీ కామెంట్స్ చదివాను. టీ20 నుంచి వైదొలగవద్దని సూచించినట్లు నాకైతే గుర్తలేదు. గంగూలీ స్టేట్‌మెంట్ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. పలు రకాలైన వ్యాఖ్యలు బయట ప్రచారంలో ఉన్నాయి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news