నెలరోజుల వ్యవధిలోనే రెండు హిట్స్! రవితేజ చరిష్మా.!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ రోజు థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక విడుదల అయిన అన్ని థియేటర్స్ లో అన్ని చోట్ల అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

టాక్ ప్రకారం చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టినట్టు తెలుస్తోంది. చిరు అభిమాని అయిన బాబీ మెగాస్టార్ ను చక్కగా ప్రజెంట్ చేశారని అంటున్నారు. మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయని గాట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి చిరు, రవితేజల మెగా మాస్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారని అర్థంఅవుతోంది.

ఇక ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర సినిమాకి హైలైట్ గా ఉందని అంటున్నారు. ఇప్పటికే రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన చిత్రం ధమాకా సినిమా కూడా 100 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించింది. ఈ సినిమా తోనే రవితేజ పట్టరాని ఆనందంతో ఉన్నాడు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా హిట్ కావడం అలాగే ఇందులో తన పాత్ర పవర్ ఫుల్ గా ఉండడం తో, ఇవి రెండూ నెల రోజుల వ్యవధిలోనే రావడం తో  రవితేజ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news