రెండు ప్రముఖ బ్యాంకులకు ఝలక్ ఇచ్చిన రిజర్వు బ్యాంక్..!

తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుని రెండు ప్రముఖ బ్యాంకులకు ఝలక్ ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. కోటి రూపాయలుకు పైగా పెనాల్టీ వేసింది.

 

బ్యాంక్ రూల్స్ ని అతిక్రమించడం వల్లనే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ICICI Bank, ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB పైన భారీ జరిమానాని విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో రూ.30 లక్షల పెనాల్టీ ఐసీఐసీఐ బ్యాంక్‌ కి వేసింది. అలానే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై రూ.1.8 కోట్లు జరిమానా వేసింది బ్యాంక్. 2019 మార్చి 31 నాటికి సంబంధించి బ్యాంక్ ఆర్థిక స్థితి తెలుసుకోవడానికి తనిఖీ చేశామని ఆర్‌బీఐ అంది.

రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్‌, తనిఖీ రిపోర్ట్‌లో బ్యాంక్ ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంగించిందని తెలిపింది. ఈ మేరకు నోటీసులు కూడా ఇచ్చినట్టు ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంక్ నుంచి స్పందన వచ్చిన తర్వాత ఆర్‌బీఐ తుది నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు చట్టంలోని సెక్షన్ 19లోని సబ్-సెక్షన్ (2)ని ఉల్లఘించిందని ఆర్‌బీఐ అంది.