రూ.100 నాణెం పై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించడానికి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..

-

2022-2023 ఏడాదికి ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే..ఇప్పటికే పలు అంశాలు మారిన విషయం తెలిసిందే.మొన్నీమధ్య కరెన్సీ నోట్లపై గాంధీ బదులుగా అబ్దుల్ కలాం,రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మలను ముద్రించాలని అనుకుంది.ఇప్పుడు వంద నాణెం పై స్వర్గీయ నటుడు, రాజకీయ వేత్త నందమూరి తారక రామారావు బొమ్మను ముద్రించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వెల్లడించారు.

తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న రూ.100 నాణెం వాడుకలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది.. మహానాయకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు తిరుపతి అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమని.. రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచే ఆయన ప్రారంభించారని ఆమె గుర్తుచేశారు.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మరో పది నెలల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరూ శత జయంతి వేడుకలకు హాజరు కావాలని ఆమె కోరారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుపతిలో జరిగిన శత జయంతి వేడుకల్లో పాల్గొనడం మిక్కిలి సంతోషాన్ని కలిగించింది అని ఆమె అన్నారు.నాణాల పై ఎప్పుడూ ఎన్టీఆర్ బొమ్మను ముద్రిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news