చెక్ మోసాలు అడ్డుకోవడానికి ఆర్బీఐ కీలక నిర్ణయం..!

-

తరచూ జరిగే చెక్ మోసాలు చూసి భయపడిపోతున్నారు. చెక్కు మోసాలు చాలానే చూస్తున్నాం. చెక్ మోసాలు అడ్డుకోవడానికి ఆర్బీఐ సరికొత్త రూల్స్ ప్రవేశ పెట్టింది. పాజిటీవ్ పే’ పద్ధతి ద్వారా చెక్కు మోసాలు దాదాపుగా ఉండవు. ఉదాహరణకు రూ.100000 పేమెంట్ కోసం మీరు ఓ వ్యక్తికి చెక్ ఇచ్చారనుకుందాం. మీరు ఇచ్చిన చెక్‌ను ఫోటో తీసుకొని మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ చెక్ వివరాలను మీ బ్యాంకు మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. సదరు వ్యక్తి ఆ చెక్ డ్రా చేసుకోవడానికి వెళ్లినప్పుడు మీరు యాప్ ద్వారా అప్‌లోడ్ చేసిన వివరాలతో మ్యాచ్ చేసి చూస్తారు బ్యాంకు సిబ్బంది తెలిపారు.

bank-chek
bank-chek

ఈ యాప్‌లో, చెక్‌లో మీరు ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉంటే పేమెంట్ పూర్తి అవుతుంది. ఆ చెక్‌ను బ్యాంకు తిరస్కరిస్తున్నారు. ఆ సమాచారాన్ని మీకు అందిస్తుంది. చెక్ వివరాలు రీ – ఎగ్జామినేషన్ చేయాలని మీకు సూచిస్తుంది. అందే మీరు ఇచ్చిన చెక్ క్లియరెన్స్‌కు వెళ్లగానే మీకు తెలుస్తుందన్న మాట. మీరు అప్‌లోడ్ చేసిన సమాచారాన్ని సరిచూసుకోకుండా చెక్ క్లియర్ చేసే అవకాశం ఉండదని సిబ్బంది తెలిపారు. దీని వల్ల చెక్ మోసాలకు అడ్డుకట్ట పడ్డట్టేనని తెలియజేశారు.

ఈ పద్ధతికి సంబంధించిన విధివిధానాలను ఆర్‌బీఐ త్వరలో వివరాలు వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటికే చెక్కు మోసాలను అడ్డుకోవడానికి ఐసీఐసీఐ బ్యాంకు ఇలాంటి పద్ధతే పాటిస్తోందని తెలిపారు. 2019 మే నుంచి తమ కస్టమర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందిస్తోందన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ ఎవరికైనా చెక్ ఇవ్వగానే ఆ వివరాలను బ్యాంకు మొబైల్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేస్తారని తెలిపారు.

అందులో చెక్ నెంబర్, తేదీ, ఏ వ్యక్తి పేరుతో చెక్ అందజేస్తారు. అకౌంట్ నెంబర్, అమౌంట్ లాంటి వివరాలను ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్ వివరించాలని తెలిపారు. అంతేకాక చెక్ ముందు, వెనుక ఫోటోలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఆ వివరాలను సరిచూసుకున్న తర్వాతే చెక్ క్లియర్ చేస్తుంది ఐసీఐసీఐ బ్యాంకు. ఇప్పుడు ఇదే విధానం పాజిటీవ్ పే మెకానిజం పేరుతో ఇతర బ్యాంకులకు కూడా రానుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news