రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కస్టమర్లకు, ఏటీఎం వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకులకు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు పెనాల్టీ ల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. దాంతో బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది. ఒకవేళ ఏటీఎంలలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు మరియు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు చార్జీలు పడతాయి. నెలలో 10 గంటలకు మించి ఏటీఎం లో క్యాష్ లేకపోతే అప్పుడు జరిమానా ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. దాంతో కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది.
ప్రస్తుతం చాలా ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదు. డబ్బులు ఉన్నాయా లేవా అనేది తెలియదు.. డెబిట్ కార్డు పెట్టి పిన్ ఎంటర్ చేసిన తర్వాత విషయం తెలుస్తోంది. దాంతో కస్టమర్లు అసౌకర్యాన్ని గురవుతారు. అయితే ఈ పరిస్థితులు ఇకపై లేకుండా చేసేందుకు ఏటీఎంలలో ఎప్పుడూ డబ్బులు ఉండేలా ఆర్బిఐ రూల్స్ సవరించింది. ఒకవేళ ఏటీఎంలలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు వైట్ లేబుల్ ఆపరేటర్లకు పది వేల చొప్పున జరిమానా పడుతుంది. ఆర్బీఐ జరిమానా భయంతో బ్యాంకులు ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్లకు ఏటీఎం లతో తిప్పలు తప్పే అవకాశం ఉంది.