వారికి జనవరి ఒకటి నుండి RBI కొత్త రూల్స్…!

-

బ్యాంక్ లో మీకు ఖాతా ఉందా..? బ్యాంక్ లాకర్ సర్వీసులు ఉపయోగిస్తుంటారు..? అయితే తప్పక మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటికి సంబంధించి కొత్త రూల్స్ ని తీసుకు వచ్చింది. కొత్త ఏడాది నుంచి బ్యాంక్ సేఫ్ లాకర్ రూల్స్ మారనున్నాయి. కనుక లాకర్లు ని ఉపయోగించే వారు వీటిని తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

RBI
RBI

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఆగస్ట్ నెలలోనే బ్యాంక్ లాకర్ రూల్స్ గురించి వెల్లడించింది. అలానే అన్ని బ్యాంక్స్ కి ఆదేశాల్ని ఇచ్చింది. లాకర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి బ్యాంకులు వాటి బోర్డు ఆమోదంతో సొంత పాలసీని కలిగి ఉండాలని అంది.

కొత్త, ప్రస్తుత సేఫ్ డిపాజిట్ లాకర్లకు కొత్త రూల్స్ వర్తిస్తాయని గుర్తించుకోవాలి. వెయిటింగ్ పీరియడ్ వివరాలు కూడా కంప్యూటరైజర్డ్ సిస్టమ్‌లో ఎంటర్ చెయ్యాలి. అలానే లాకర్లు ఖాళీగా అందుబాటులో లేకపోతే అప్పుడు కస్టమర్లకు బ్యాంకులు అలాట్‌మెంట్ నెంబర్ ఇస్తాయి.

ఒకసారి లాకర్ ఖాళీ అవ్వగానే మీకు ఆ లాకర్ వస్తుంది. బ్యాంక్ లాకర్‌లోని వస్తువులకు, తమకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పకూడదు. బ్యాంక్ ఉద్యోగుల ప్రమేయం లేదు అంటే నిర్లక్ష్యం కారణంగా లాకర్‌లోని వస్తువులు పోతే అప్పుడు బ్యాంకులే బాధ్యత వహించాలి.

Read more RELATED
Recommended to you

Latest news