కొత్త సంవత్సరం నాడు మీ స్నేహితులు, బంధువులకి ఇలా విషెస్ ని తెలపండి..!

-

2021 కి వీడ్కోలు చెప్పి…. 2022 కి ఆహ్వానం పలికే సమయం వచ్చేసింది. సరికొత్త ఆశలతో 2022 కు ఆహ్వానం పలికేద్దాం. ఈ కొత్త సంవత్సరంలోనైనా అందరూ హాయిగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుందాం.

 

 

ఈ నేపథ్యంలో మీకు కొన్ని అందమైన న్యూ ఇయర్ విషెస్ ఇక్కడ ఉన్నాయి. మరి ఆ విషెస్ ని మీ స్నేహితులతో శ్రేయోభిలాషులు తో షేర్ చేసుకుని కొత్త సంవత్సరాన్ని మంచి జరగాలని కోరుకోండి.

ప్రతి సుమం సుగంధభరితం,
ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం…!
నూతన సంవత్సర శుభాకాంక్షలు..

నిన్నటి వరకు నేర్చుకున్నాం.. రేపటి కోసం ఆలోచిద్దాం.. హ్యాపీ న్యూ ఇయర్..!

ఈ నూతన సంవత్సరం నీ జీవితంలో కాంతుల నింపాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఎన్నో ఆశలు మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ ఏడాది నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

”నువ్వు అనుకున్నది సాధించాలి
నిన్ను విజయం వరించాలి
నిన్ను అందరూ పొగుడుతూ ఉండాలి
నేను అది చూసి మురిసిపోవాలి
అది ఈ కొత్త సంవత్సరం నుండి ఆరంభం అవ్వాలి”.

గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
అభ్యుదయం ఆకాంక్షిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.

ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం
అవధులులేని ఉత్సాహంతో ఉత్సవం చేసుకుందాం.. హ్యాపీ న్యూ ఇయర్..

కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కొత్త సంవత్సరం సరికొత్త నిర్ణయం తీసుకుని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్.

 

Read more RELATED
Recommended to you

Latest news