కియారా- సిద్ధార్థ్‌లకు స్పెషల్‌  విషెస్‌ చెప్పిన ‘RC15’ టీమ్

-

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే ముంబయిలో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసింది ఈ జంట. వీళ్ల రిసెప్షన్ కు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై.. శుభాకాంక్షలు చెప్పారు. అయితే తాజాగా ఈ జంటకు కియారా నటిస్తున్న RC 15 టీమ్ స్పెషల్ గా విషెస్ చెప్పింది. కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ.. ఓ స్పెషల్ వీడియోను ట్విటర్ లో షేర్ చేసింది.

రామ్‌ చరణ్ ‌హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా ‘ఆర్‌సీ15’ వర్కింగ్‌ టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇందులో చరణ్‌ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు స్టార్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న సందర్భంగా.. చిత్రబృందం ఈ జోడికి ప్రత్యేక వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. రామ్‌చరణ్‌, దిల్‌రాజు, శంకర్‌తో పాటు మూవీ యూనిట్‌ అంతా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోపై కియారా స్పందిస్తూ..‘‘ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరంతా నా పై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు’’ అని తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news