ఈ రోజు పంజాబ్ వేదికగా పంజాబ్ మరియు బెంగళూర్ జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు ఎంతో కసిగా బరిలోకి దిగాయి. గత మ్యాచ్ లో పంజాబ్ గెలవగా, బెంగళూర్ మాత్రం చెన్నై తో చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో డుప్లిసిస్ మరియు మాక్స్వెల్ లు అద్భుతమైన ఆటతీరుతో దాదాపు టీమ్ ను గెలిపించేలా చేశారు. కానీ చివర్లో బెంగళూర్ ఆటగాళ్ళు చేతులు ఎత్తేయడంతో చెన్నై గెలిచింది. కాగా మ్యాచ్ లో డుప్లిసిస్ కు గాయం అయినా మ్యాచ్ కోసం అంత బాధను పక్కన పెట్టి ఆడాడు.
ఈ గాయం కొంచెం ఎక్కువగా ఉండడంతో ఈ రోజు మ్యాచ్ లో కెప్టెన్ గా కోహ్లీ మారాడు. డుప్లిసిస్ ను కేవలం బ్యాటింగ్ కోసం మాత్రమే వాడుకుని… ఫీల్డింగ్ లో బౌలర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవడానికి ప్లాన్ చేసింది బెంగళూర్ యాజమాన్యం. మరి ఈ ప్లాన్ ఫలిస్తుందా చూడాలి.