పవన్ కళ్యాణ్ బద్రి సినిమా రీ రిలీజ్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

-

ప్రస్తుత కాలంలో రీ రిలీజ్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది అని చెప్పవచ్చు. అయితే ఈ ట్రెండుకు బీజం పోసింది మాత్రం మహేష్ బాబు అభిమానులు.. ఆయన సినిమాలు ఏవి లేని నేపథ్యంలో ప్రజలలో క్రేజ్ తగ్గిపోతుందని ఆలోచించిన అభిమానులు పోకిరి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి మళ్లీ కలెక్షన్స్ రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలు తమ కెరియర్లో సాధించిన బ్లాక్ బస్టర్ సినిమాలను వారి పుట్టినరోజులు సందర్భంగా విడుదల చేస్తూ క్యాష్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారని చెప్పాలి.

ప్రతినెల పవన్ కళ్యాణ్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా జల్సా సినిమాను మొదటిగా రిలీజ్ చేసి భారీ కలెక్షన్స్ వసూలు చేయగా ఆ తర్వాత ఖుషి సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేసి మొదటి రోజే డైరెక్ట్ సినిమా రేంజ్ లో కలెక్షన్లు రాబట్టారు. ఇక ఇప్పుడు బద్రి సినిమాను కూడా రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాలను పక్కన పెడితే అప్పటికి ఏ సినిమా థియేటర్లో ఉంటుందో? ఉండదో? తెలియని పరిస్థితులలో ఈ సినిమాను రీ రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు కూడా ఆలోచిస్తున్నారు.

ఈ క్రమంలోనే బద్రి సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు నెలకొక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు . మరి ఈ సినిమా ఏ విధమైన కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news