అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఈ ప్రభుత్వం సిద్దంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మతపరమైన విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లారని రథాన్ని తగులపెట్టడం ఎంత తప్పో.. చర్చి మీద రాళ్లేయడం కూడా అంతే తప్పని ఆయన అన్నారు. హిందూమతం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్న ఆయన చంద్రబాబుకు దైవ భక్తి లేదు.. దైవమంటే భయమూ లేదని అన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏపీలోకి రావద్దన్న చంద్రబాబుకు సీబీఐ మీద ఎప్పుడు నమ్మకం పెరిగింది..? అని ప్రశ్నించారు. అంతర్వేది ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. మంత్రుల పప్యటనలో జరిగిన పరిణామాలు కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయని, మంత్రులు పర్యటన జరిగిన రోజు మరోక మత ప్రార్ధనా మందిరంపై రాళ్లు రువ్విన ఘటన కరెక్ట్ కాదని అన్నారు. మతం ముసుగులో సంఘ విద్రోహ చర్యలు పాల్పడేందురు కొందరు కుట్ర పన్నే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
అసలు నిజాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రభత్వం ప్రయత్నిస్తోంటే కొందరు బురద జల్లుతున్నారని అన్నారు.