కొత్త ఐటీ పార్కు.. చుట్టుప‌క్క‌ల “రియ‌ల్” డ‌బుల్‌ భూమ్‌..!

-

హైద‌రాబాద్, రింగ్ రోడ్డు ప‌రిస‌ర ప్రాంతాల్లో భూముల ధ‌ర‌ల ఎక్కువ‌గానే ఉండేవి. 2007 లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. మాదాపూర్ కి 20 కిలోమీటర్ల రేడియస్ లో ఉండే భూమి ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ భూమి ధరలు బాగా పెరిగాయి. పైగా హైదరాబాదులో ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చాయి. అయితే అక్కడ మాదిరిగానే ఇప్పుడు ఉత్తర హైదరాబాదులో కూడా వచ్చేటట్లు కనపడుతోంది. ఇటీవ‌ల కండ్లకోయలో ఐటీ పార్కు శంఖుస్థాప‌న జ‌ర‌గ‌టంతో భూముల ధ‌ర‌లు ఆకాశాన్నంటేలా ఉన్నాయి.

తెలంగాణ ఐటీ మినిస్టర్ కెటి రామారావు కండ్లకోయ దగ్గర ఐటీ పార్క్ ని శంకుస్థాపన చేశారు. అక్కడ 100 కంటే ఎక్కువ కంపెనీలు రానున్నట్లు తెలుస్తోంది. అలానే 50 వేల మంది ఉద్యోగులు కి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఈ ఐటీ పార్క్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం బాగా విస్తరించేలా కనపడుతోంది. మేడ్చల్, దుందిగ‌ల్‌, మనోహరాబాద్ ఏరియా లో అయితే రియల్ ఎస్టేట్ బాగా పెరిగిన పోతుందని అర్థమవుతోంది.

దుందిగ‌ల్‌, మేడ్చ‌ల్, మ‌నోరాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇప్ప‌టికే ఎన్నో వెంచ‌ర్లు వెల‌సి ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏరియాలో విప‌రీతంగా విస్త‌రిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. కండ్లకోయ చుట్టుప‌క్క‌ల‌ ప్రాంతంలో మై హోమ్, అపర్ణ, రాజ పుష్ప, అరబిందో మొదలైన బిల్డర్లు పాగా వేసే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే వంద‌లాది వెంచ‌ర్లు వెల‌సి ఉన్నాయి. వీటిలో పెట్టుబ‌డి పెట్టిన మ‌ద్య‌త‌ర‌గ‌తి వారికి ఇది నిజంగా శుభ‌వార్తే. నిన్న‌టి వ‌ర‌కు ఒక లెక్క ఇప్ప‌టి నుండి ఒక లెక్క గ‌జం రేటు డ‌బుల్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

కండ్ల‌కోయను సెంట్ర‌లైజ్ చేసుకుని 20 కిమీ రేడియ‌స్‌లో రియ‌ల్ ఎస్టేట్ బాగా పెరుగుతాయ‌ని నిపుణుల విశ్లేష‌ణ‌. దుందిగ‌ల్‌, మేడ్చ‌ల్, బౌరంపేట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఉండ‌టం కూడా ప్ల‌స్ పాయింట్‌. ఇప్ప‌టికే రియ‌ల్ ఎస్టేట్ బాగా ఉన్నా కూడా ఐటీ పార్క్ రావ‌డంతో మ‌రింత పెరుగుతుంది. ఇదిలా ఉంటే తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో నాగోల్, ఎల్బీనగర్ మరియు ఉప్పల్ వద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా పెరిగింది.

కేవలం ఐటీ మాత్రమే కాదు హైదరాబాద్ సౌత్ ఇండియాలో పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా మారిపోవచ్చు. ముంబాయి మరియు చెన్నై లాగ కాకుండా అన్ని దిశల్లో కూడా హైదరాబాద్ విస్తరించి ఉంటుంది. హైదరాబాద్ లో కారు తయారీ కంపెనీలను కూడా ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news